శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (11:20 IST)

ఐరన్ ట్యాబ్లెట్లకు బదులు ఇవి తీసుకుంటే?

ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారా? అయితే ఇక వాటిని పక్కనబెట్టేయండి.. ఐరన్ సమృద్ధిగా వుండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. నీరసంగా వుండటం, కళ్లు తిరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పాలిప

ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారా? అయితే ఇక వాటిని పక్కనబెట్టేయండి.. ఐరన్ సమృద్ధిగా వుండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. నీరసంగా వుండటం, కళ్లు తిరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి.. ఐరన్ లోపానికి కారణం. అలాంటి రుగ్మతల నుంచి తప్పించుకోవాలంటే.. ఐరన్ పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. 
 
సాధారణంగా శరీరభాగాల పనితీరుకి అత్యవసరమైన మూలకాల్లో ఐరన్‌ ఒకటి. రక్తంలోని ఆక్సిజన్‌ అన్ని భాగాలకూ చేరేందుకూ హార్మోన్ల తయారీకీ, శక్తి ఉత్పత్తికీ, కణాల పెరుగుదలకీ, రోగనిరోధ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికీ... ఇలా ఎన్నో పనులకి ఐరన్‌ అవసరం. అలాంటి ఐరన్ లోపం వల్ల ఆరోగ్యానికి కీడేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఐరన్‌ లోపిస్తే రక్తహీనత వస్తుంది. ఫలితంగా అన్ని భాగాల పనితీరుమీదా దాని ప్రభావం పడుతుంది. కాబట్టే ఐరన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, చికెన్, చేపల్లో రెండు రకాల ఐరన్ వుంటుంది.
 
అదే కూరగాయల్లోనూ ఐరన్ శాతం ఎక్కువ. కాబట్టి మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లోనే ఐరన్‌ లోపం ఎక్కువ. ఐరన్ లోపం వున్నవారు నట్స్‌, విత్తనాలతోబాటు పాలకూర, బ్రకోలి, కొత్తిమీర... వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా తీసుకున్న ఐరన్‌ ఒంటికి పట్టాలంటే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పండ్లను, పప్పు దినుసులు, పొట్టు ధాన్యాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.