వర్షాకాలం.. పచ్చికందులను సూప్‌ల్లో వేసుకుని తింటే..?

పచ్చికందులను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. ఇవి రక్తవృద్ధిని పెంచుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఈ గింజల్లో పుష్కలంగా ఉండే ఫోలిక్‌యాసిడ్‌ గర్భిణీలకు ఉపయోగపడుతుంది. కంది గింజల్లో తే

Selvi| Last Updated: శనివారం, 14 జులై 2018 (11:03 IST)
పచ్చికందులను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. ఇవి రక్తవృద్ధిని పెంచుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఈ గింజల్లో పుష్కలంగా ఉండే ఫోలిక్‌యాసిడ్‌ గర్భిణీలకు ఉపయోగపడుతుంది. కంది గింజల్లో తేమ అధికంగా వుంటుంది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, పీచుపదార్ధాలు, ఖనిజలవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 
 
మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, జింక్‌ వంటి ధాతువులు అధికం. పచ్చి కందుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్‌ కణాలపై పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో పచ్చి కందులను తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. 
 
ఎండిన కందిపప్పుతో చేసే వంటకాలు తింటూనే ఉన్నా తాజాగా లభించే పచ్చి కందులు రుచిలోనే కాదు పోషకాల పరంగాను బోలెడు ప్రయోజనాలు అందిస్తాయి. మామూలు కందిపప్పుతో పోలిస్తే పచ్చి కందికాయల నుంచి 25 శాతం ఎక్కువ పోషకాలు అందుతాయి. వేడివేడిగా ఉడకబెట్టుకుని తినడం వల్ల ముఖ్యంగా దగ్గు, ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
లేదంటే పప్పుతో పాటూ సూపుల్లో వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పనీర్‌తో కలిపి మసాలా కూరలు కూడా వండుకుంటారు. ఇలా పచ్చి కందులను వర్షాకాలంలో, శీతాకాలంలో వంటల్లో  చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :