శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:52 IST)

ఉల్లిపాయ జ్యూస్‌తో రక్తప్రసరణ సాఫీగా....

ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్స్, న్యూట్రియన్స్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తాయి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్, బ్యాక్టీరియాల్ గుణాలు చుండ్రును తొలగిస్తాయి. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. రక్తప్రసరణ క్రమంగా జరిగితే జుట్టు రాలకుండా ఉంటుంది. ఉల్లిపాయ జ్యూస్‌ను తయారుచేసుకుని దానిని జుట్టు రాసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం...
 
ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఒక కప్పు ఉల్లి జ్యూస్‌లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాతు చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది. 
 
ఆనియన్ జ్యూస్‌లో కొద్దిగా ఆలివ్ నూనె, పెరుగు కలిపి జుట్టు ప్యాక్ వేసుకోవాలి. 2 గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. కరివేపాకులను పొడి చేసుకుని అందులో ఉల్లిపాయ జ్యూస్, నిమ్మరసం కలిపి వెంట్రుకలకు రాయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.