శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (10:52 IST)

దంపుడు బియ్యం ఆరోగ్య ప్రయోజనాలు...

గోధుమలు, ఇతర ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ దాదాపు 7 శాతం అధికంగా ఉన్నాయి. బియ్యంలోని కార్బోహైడ్రేట్స్ శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతాయి.
  
 
బియ్యంలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇతర ఆహార పదార్థాలు, ఫాస్ట్‌ఫుస్స్ కంటే బియ్యంతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దక్షిణంలో ఎక్కువగా బియ్యంతో చేసిన ఆహారానే తీసుకుంటుంటారు. బియ్యంలోని పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇవి శరీరానికి కావలసిన విటమిన్స్‌ని అందిస్తాయి. దంపుడు బియ్యంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ బియ్యంలో తయారుచేసిన నూనెను వంటకాల్లో వాడితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నూనెలోని మినరల్స్, ప్రోటీన్స్ అధిక బరువును తగ్గిస్తాయి.