ముఖం తాజాగా కనిపించాలంటే ఈ ఫేస్ ప్యాక్‌లు వేసి చూడండి...

Last Updated: బుధవారం, 28 ఆగస్టు 2019 (13:43 IST)
ముఖం తాజాగా కనిపించాలంటే లోపాలను సరిదిద్దే ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఇంట్లోనే దొరికే వస్తువులతో ఆరోగ్యకరమైన ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే

మొటిమలు తగ్గలంటే: పసుపు, కలబంద గుజ్జు, టీ ట్రీ ఆయిల్, నిమ్మరసాలను సమపాళ్లంలో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లనీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే మొటిమలు తగ్గుతాయి.

చర్మం తెల్లగా కనిపించాలంటే: పసుపు, నిమ్మరసం లేదా నారింజ రసం, తేనె సమపాళ్లంలో కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగితే చర్మపు నలుపు తగ్గుతుంది.

నల్లని వలయాలు పోవాలంటే: పసుపు, విటమిన్-ఇ నూనె, కలబంద గుజ్జు కలిపి కళ్ల కింద అప్లై చేసి, ఆ తర్వాత కడిగితే నల్లని వలయాలు తగ్గుతాయి.

ముడతలు తగ్గాలంటే: పసుపు, రోజ్ ఆయిల్, గుడ్డు తెల్లసొనలను కలిపి ముఖానికి పూసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడగేసుకుంటే, చర్మం బిగుతును సంతరించుకుంటుంది.దీనిపై మరింత చదవండి :