గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : సోమవారం, 13 జూన్ 2016 (15:53 IST)

కొబ్బరిపాలతో జుట్టుకు పోషణ.. కొబ్బరి పాలు, నిమ్మరసం కలిపి వాడితే?

జుట్టుకు పోషణను అందించి మృదువుగా చేసేందుకు కొబ్బరిపాలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌లో తేమను అందించి మృదువుగా ఉంచే గుణం కలిగి ఉంటుంది. అలాగే మాడుకి అవసరమైన ఆల్కలైన్‌ ఆమ్లాన్ని

జుట్టుకు పోషణను అందించి మృదువుగా చేసేందుకు కొబ్బరిపాలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌లో తేమను అందించి మృదువుగా ఉంచే గుణం కలిగి ఉంటుంది. అలాగే మాడుకి అవసరమైన ఆల్కలైన్‌ ఆమ్లాన్ని సమతుల్యంగా ఉంచే ఆమ్లాలు వీటిలో పుష్కలంగా లభిస్తుంది. తాజా కొబ్బరి పాలలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. నిమ్మరసానికి క్లెన్సింగ్‌ గుణం ఉంటుంది. కొబ్బరి పాలు, నిమ్మరసం కలిపి వాడడం వల్ల జుట్టుకి అందమైన, ఆరోగ్యమైన లుక్‌ వస్తుంది.
 
కొబ్బరి నూనె వేడి చేసి చేతివేళ్లతో మర్దనా చేస్తూ జుట్టుకి రాసుకోవాలి. ఆ తరువాత ఒక తుండును వేడి నీళ్లలో ముంచి నీళ్లను పిండేయాలి. ఆ తుండును తలపాగాలాగా చుట్టి ఐదునిమిషాలు ఉంచుకోవాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేశాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
పాలల్లో ఉండే కొవ్వు జుట్టును మృదువుగా ఉంచుతుంది. తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టుకి మెరుపు లభిస్తుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో పాలు కలిపిన మిశ్రమాన్ని స్ర్పే బాటిల్‌లో నింపాలి. షాంపుతో తలస్నానం చేశాక మిశ్రమాన్ని జుట్టుకు స్ర్పే చేయాలి. రెండు నిమిషాల తరువాత మామూలు నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. 
 
ఆలివ్‌ నూనెలో హైడ్రాక్సిటైరోజోల్‌, విటమిన్‌-ఇ లు ఉంటాయి. ఈ రెండూ జుట్టుకి పోషణను అందించడంలో బాగా పనిచేస్తాయి. గుడ్డులో విటమిన్‌, మినరల్స్‌తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఆలివ్‌ నూనెలో రెండు గుడ్ల సొనల్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.