వీపువై మెుటిమలు తొలగిపోవడానికి? తేనెను రాసుకుంటే?

శనివారం, 14 జులై 2018 (13:45 IST)

కొంతమందికి వీపు మీద చిన్న చిన్న మెుటిమలు లేదంటే దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి కొన్నిసార్లు కారణం కావొచ్చు. శరీరంలో వచ్చే మార్పులకు మన చర్మం తొందరగా స్పందిస్తుంది. అలాంటి మార్పు వస్తే వెంటనే గమనించాలి.
honey
 
చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నట్లైతే మానేసి తాజా కూరగాయలు, మాంసకృతులు ఉండే ఆహారం అధికంగా తీసుకుంటే మంచిది. కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం వలన వీపును అలా కుర్చీకి ఆనించి ఉంచుతాం. ఇది కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే పని మధ్యలో అప్పుడప్పుడు తప్పనిసరిగా విరామం ఉండేలా చూసుకోవాలి.
 
సాయంత్రం వ్యాయామం చేసిన తరువాత స్నానం మానకూడదు. లేదంటే చెమట వలన కూడా ఈ సమస్య పెరిగి అవకాశం ఉంది. చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. జుట్టు ఎక్కువుగా వీపు భాగానికి తగలడం వలన కూడా ఈ సమస్య ఎక్కువవుతుంది. పొడవు జుట్టు ఉన్నవాళ్లు జుట్టు ముందు వైపునకు వేసుకుంటే మంచిది.
 
కొబ్బరినూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు చిన్న దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి రాసుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. తేనె కూడా దీనికి మంచి పరిష్కారం. తేనెను ఆ భాగంలో రాసుకుని అరగంట తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఉండే సహజగుణాలు సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.దీనిపై మరింత చదవండి :  
వీపుపై మెుటిమలు తేనె కొబ్బరినూనె కూరగాయలు మాంసాహారం శరీరం చర్మం బ్యూటీ చిట్కాలు Tips Shoulders Honey Coconut Oil Vegetables Nonveg Hair Skin Body Beauty Black Marks

Loading comments ...

మహిళ

news

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..?

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె ...

news

ఆఫీసులో రోజంతా ఏసీలో ఉంటున్నారా? వీటిని పాటిస్తే?

చాలా మంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పని చేస్తుంటారు. దాంతో చర్మం, జుట్టు, పెదాలు తరుచూగా ...

news

వర్షాకాలంలో జిడ్డు వదిలించుకోవాలంటే..?

వర్షాకాలంలో ముఖంపైనే కాకుండా.. కేశాలకు పట్టిన జిడ్డు వదిలించుకోవాలంటే.. నిమ్మరసాన్ని ...

news

బంగారు నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

రోజూ వేసుకునే బంగార నగలు కొన్ని కారణాల వలన రంగుమారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటి ...