కొబ్బరి నూనెను వేడిచేసి తలకు రాసుకుంటే?

గురువారం, 12 జులై 2018 (12:14 IST)

స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా బాదం నూనెను తీసుకుని కాస్త వేడి చేయాలి. ఆ వేడి చేసిన నూనెను తలకు పట్టించి మునివేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. దీని వలన రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు కుదుళ్లు గట్టిపడుటకు సహాయపడుతుంది. దీని ఫలితంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఉల్లిపాయ జ్యూస్ చాలామందికి రుచించదు. కానీ దీనిలో అత్యధికంగా ఉండే సల్ఫర్ మీ కుదుళ్ల మధ్య రక్తప్రసరణను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.

 
 
కుదుళ్లు రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సూక్ష్మజీవులను అరికట్టడంలో మంచి ఔషధం. జుట్టు సంబంధిత సమస్యలకు ఉసిరిని మించిన ఔషదం మరొకటి లేదు. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ సి. ఇలాంటి సమస్యలకు ఉసిరిని తలకు పట్టించడం వలన కుదుళ్లకు పోషకాలు బాగా అందుతాయి. దీంతో జుట్టు దృఢంగా మెరుస్తుంది.
 
వేపాకులను ముద్దగా చేసుకుని ఉడికించాలి. చల్లారిన తరువాత తలకు రాసుకోవాలి. 30 నిమిషాల అలానే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఉండే ఎంజైములు జుట్టు ఎదుగుదలకు బాగా సహకరిస్తాయి. కలబంద జెల్‌ లేదా జ్యూస్‌ను తలకు పట్టించడంతో పాటు పరగడుపునే స్పూన్ జ్యూన్ తీసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. తలపై ఉన్న మృతుకణాలను కలబంద తొలగిస్తుంది.
 
గుడ్డులోని తెల్లసొనను పెరుగులో కలుపుకుని తలకు పట్టించడం వలన జుట్టు రాలడాన్ని నివారించవచ్చును. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా కావడానికి సల్ఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చుండ్రును నివారిస్తుంది.దీనిపై మరింత చదవండి :  
కొబ్బరి నూనె ఉల్లిపాయలు ఉసిరికాయ కలబంద పెరుగు గుడ్డు విటమిన్ సి రక్తం వేపాకులు బ్యూటీ చిట్కాలు Hair Loss Tips Coconut Oil Curd Egg Vepaku Onion Vitamins Amla Juice Aloe Pulp Beauty

Loading comments ...

మహిళ

news

పెదవులు పొడిబారకుండా ఉండాలంటే?

పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో కాస్త తేనెను కలుపుకుని రాత్రి పడుకునే ...

news

మెుటిమలతో బాధపడుతున్నారా? ఓట్స్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

కాంతిహీనంగా మారిన చర్మం మృదువుగా మారాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. మెుటిమలు, మచ్చలు, కళ్ల ...

news

కాఫీ పొడిని జుట్టుకు రాసుకుంటే? ఏమవుతుందో తెలుసా?

హెయిర్‌ డై వేసుకున్నప్పుడు అవి జుట్టుకు సరిపడకపోవడం, కేశాల సహజమైన కాంతి కోల్పోవడం వంటి ...

news

బంగాళాదుంప ముక్కలు కళ్ల మీద పెట్టుకుంటే?

బంగాళాదుంపల్ని మెత్తగా చేసి దాని రసాన్ని తీసుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి ...