బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (17:43 IST)

మహిళల వంటింటి చిట్కాలు...

పెరుగు త్వరగా పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి ముక్కలను వేసుకుంటే మంచిది. పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా లేదా నూనెను వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. నిమ్మకాయ తొక్కలను పిండిన తరువాత వాటిన

పెరుగు త్వరగా పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి ముక్కలను వేసుకుంటే మంచిది. పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా లేదా నూనెను వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. నిమ్మకాయ తొక్కలను పిండిన తరువాత వాటిని కుక్కర్ క్రింద వేస్తే దానిలో నుండి వెలువడే వాసన తొలగిపోతుంది. పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే చాలా రోజుకు పాడవకుండా ఉంటాయి. 
 
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే ఆ గిన్నె అంచుకు నూనెను రాయాలి. అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడిగితే శుభ్రంగా ఉంటాయి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూన్ పాలు ఆ ముక్కలలో వేయాలి. పసుపు నీటితో కిచెన్‌ను శుభ్రంచేస్తే దోమలు రావు. బిస్కెట్ ప్యాకెట్‌లను బియ్యం డబ్బాలో ఉంచడం వలన తొందరగా మెత్తబడవు.
 
ఇంగువలు నిల్వచేసే డబ్బాలో పచ్చిమిరపకాయలు వేస్తే తాజాగా ఉంటాయి. నూనె క్రింద ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి చల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది. క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్కను వేయ్యాలి. కత్తిపీటకు ఉప్పురాయడం వలన పదునుగా తయారవుతుంది.
 
బట్టలపై ఇంకు మరకలు తొలగిపోవాలంటే నిమ్మరసం లేదా టూత్ పేస్ట్ వేసిరుద్దుకుంటే మరకలు తొలగిపోతాయి. కాకరకాయ ముక్కలలో కొంచెం ఉప్పురాసుకుని గంటసేపు ఉంచితే చేదు పోతుంది. వెల్లుల్లిపాయను మెత్తగా దంచి అందులో కొద్దిగా నీటిని కలుపుకుని బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి దరిచేరవు.
 
బ్రెడ్ ప్యాకెట్‌లో బంగాళదుంప ముక్కలు ఉంచితే అవి త్వరగా పాడవవు. నూనె పొంగకుండా నూనెలో కొంచెం చింతపండు వెయ్యాలి. గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి. చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.