శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By జె
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:42 IST)

అవాంఛిత రోమాలు తొలగించడం చాలా ఈజీ

ఈకాలం యువతల వస్త్రధారణలో మార్పు వచ్చింది. ఇది పెద్దగా చెప్పనవసరం లేదు. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా దుస్తులు వేసుకోవడం మామూలైంది. పొట్టిపొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు శరీరంలో ఎక్కువ భాగం బయటకు కనిపించడం సర్వసాధారణం. అలాంటి వస్త్రాలు వేసుకోవాలంటే చర్మం నునుపుగా, అందంగా ఉండాలి. చర్మం అందంగా కనిపించాలంటే శరీర భాగాల్లో కొన్నిటి వద్ద ఉండే ఉపయోగం లేని వెంట్రుకలను తొలగించాలి.
 
ఉపయోగం లేని రోమాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయట. వంశపారప్యంగా కానీ, హార్మోన్లు ఎక్కువ తక్కువలున్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు మెనోపాజ్ దశలోను అవాంఛిత రోమాలు వచ్చే అవకాశం ఉంది. వీటిని తొలగించడానికి శాశ్వత, తాత్కాలిక పరిష్కార మార్గాలు ఉన్నాయి. శరీరంలోని వివిధ ప్రదేశాల్లో వచ్చే రోమాలను వివిధ పద్ధతుల్లో కొంత జాగ్రత్త తీసుకొని తొలగించవచ్చు.
 
కొంతమంది మహిళలకు గడ్డం మీద, పైపెదవిపైన, నుదుటిపైన, బుగ్గలపైన కనుబొమల దగ్గర రోమాలు వస్తాయి. వాటిని బ్లీచింగ్, థ్రెడ్డింగ్, ఫ్లక్కింగ్, వాక్సింగ్, ఎలక్ట్రోలసిస్ పద్థతుల ద్వారా శాశ్వతంగాను, తాత్కాలికంగాను తొలగించవచ్చు. చేతులు, కాళ్ళపై ఉండే రోమాలను వాక్స్, రోమహారి క్రీములు, రేజర్స్ ఉపయోగించి నిర్మూలించాలి.
 
పొత్తకడుపు, గుండెలపైన మెడకింద భాగాల్లో వచ్చే రోమాలను వాక్స్ లేదా బ్లీచ్ చేయడం ద్వారా తొలగించాలి. ముఖాల మీద ఉండే అవాంఛీత రోమాల్ని తొలగించడానికి అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని కలిపి బ్లీచింగ్‌కి ఉపయోగించాలి. దీనికి మందు అలర్జీ వచ్చే ప్రమాదముందేమో గమనించాలి. ఇందుకోసం ఎక్కడో ఒకచోట కొద్దిగా పరీక్షించి చూసుకోవాలి. ఈ విధంగా బ్లీచింగ్ చేసుకోవడానికి కనీసం పదిహేను రోజులయినా ఎడం ఉండాలి. 
 
కనుబొమలు, పైపెదవిపై ఉండే రోమాల్ని ప్లక్కింగ్ ద్వారా తొలగించాక యాంటీ సెప్టిక్ లోషన్ రాయడం మంచిది. మార్కెట్లో దొరికే హెయిర్ రిమూవర్స్ వాడేటప్పుడు వాటి మీద ఉండే సూచనల్ని చదువుకోవాలి. అలర్జీ వస్తుందేమో పరిశీలించాకే వాడాలి. హెయిర్ రిమూవర్స్‌ని ముఖానికి వాడకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.