నువ్వుల నూనెతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?
నువ్వుల నూనె అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఫేస్‌ప్యాక్‌లా ఉపయోగపడుతుంది. ఈ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఇన్‌ఫెక్షన్స్, ఇన్‌ఫ్లమేషన్‌గా పనిచేస్తాయి. ముఖంపై మెుటిమల కారణంగా నల్లటి మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. అందువలన ప్రతిరోజూ నువ్వుల నూనెను ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.
నువ్వుల నూనెను చర్మానికి మర్దన చేసుకుంటే కాంతివంతమైన, మృదువైన చర్మాన్ని పొందుతారు. ఈ నూనె చర్మంలోని మురికిని తొలగిస్తుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. ఈ నూనె చర్మానికి మనం వాడే టిష్యూ పేపర్ ముఖాన్ని ఎలా శుభ్రం చేస్తుందో దానికంటే వందరేట్లు నువ్వుల నూనె చర్మాన్ని తాజాగా మార్చుతుంది.
పొడిబారిన చర్మానికి నువ్వుల నూనె రాసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆ మన చర్మలోనికి వెళ్ళి పొడిబారకుండా చేస్తుంది. దాంతో చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని శుభ్రంగా చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. కనుక రోజూ ఈ నూనెను చర్మానికి రాసుకోవడం వలన ముడతల చర్మం కాస్తే మృదువుగా మారుతుంది.
ఈ నూనెలోని విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. దాంతో అధిక బరువు తగ్గుతారు. అలానే బయటకెక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖం చాలా అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వుల నూనెను చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.