1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (17:47 IST)

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

Billa Ranga Basha look
Billa Ranga Basha look
కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్ లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది.
 
బ్లాక్‌బస్టర్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్ పవర్, టెక్నికల్ వాల్యూస్ లో ఈ సినిమా న్యూ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయనుంది. కాన్సెప్ట్ వీడియో, లోగో రివీల్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత ఈ గ్రేట్ విజన్ ని స్క్రీన్ పైకి తీసుకురావడానికి టీం సిద్ధమౌతోంది. 
చిత్రానికి సంబధించిన మరిన్ని ఎక్సయిటింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.