శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 జూన్ 2019 (22:23 IST)

మెరిసే చర్మం కోసం చిట్కాలు...

చర్మం సున్నితంగా, ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే కొద్దిగా టమోటో గుజ్జులో లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే వేడితాపాన్ని తగ్గించి చర్మాన్ని దృడంగా ఉంచుతుంది.
 
2. టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
 
3. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. మొటిమలు మీద రాసి, 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
 
4. ఒక క్యారెట్‌ని తురుముకుని కొంచెం నీరు పోసి ఉడకపెట్టాలి. చల్లారిన తరువాత కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
5. ఒక టీస్పూన్ కొబ్బరినూనెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేతివేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. 10 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
 
6. పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య-అపసవ్య దిశల్లో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
 
7. సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీర భాగాలు రంగు మారుతుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండుసార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
8. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా అవ్వాలంటే  పచ్చిపాలలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. దీనివల్ల ముఖంపై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.