సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (21:18 IST)

సోయాబీన్‌ను పచ్చిపాలలో కలిపి మూఖానికి పట్టిస్తే?

పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలుగా వేసుకోవ

పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలుగా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్న కడుక్కుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
సోయాబీన్‌ను మెత్తగా రుబ్బుకుని అందులో పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలాచేయడం వలన ముఖం మృదువుగా తయారవుతుంది. నిమ్మరసంలో తులసి ఆకుల రసాన్ని కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
శెనగపిండిలో నెయ్యి, పసుపు కలుపుకుని పేస్టులా తయారుచేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత మసాజ్ చేసుకుంటే పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రతిరోజూ చర్మానికి తేనె పూతగా రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి.
 
ఆ పేస్టును ముఖానికి పూతలుగా వేసుకుని పావుగంట తరువాత కడిగేస్తే మచ్చలు, కాలిన గాయాలు, మెుటిమలు తొలగిపోతాయి. కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇలాచేయడం వలన చర్మం తాజాగా ఉంటుంది.