మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:44 IST)

అమేజాన్ నుంచి ఫైర్ టీవీ స్టిక్‌ల విడుదల.. ధర రూ.3,999

అమేజాన్ నుంచి ఫైర్ టీవీ స్టిక్‌లను విడుదల చేసింది. ఫైర్ టీవీ స్టిక్‌, ఫైర్ టీవీ స్టిక్ లైట్ పేరిట ఆ డివైస్‌లు విడుదలయ్యాయి. గతంలో వచ్చిన ఫైర్ టీవీ స్టిక్‌ల కన్నా ఈ కొత్త ఫైర్ టీవీ స్టిక్‌లలో పలు అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. ఫైర్ టీవీ స్టిక్ ధర రూ.3,999 ఉండగా దీన్ని అక్టోబర్ 15 నుంచి అమేజాన్‌లో విక్రయిస్తారు. అలాగే ఫైర్ టీవీ స్టిక్ లైట్ ధర రూ.2,999గా ఉంది. దీన్ని కూడా అక్టోబర్ 15 నుంచి విక్రయించనున్నారు.
 
యూజర్లు వీటిల్లో మరింత కంటెంట్‌ను చూడవచ్చు. అలాగే అలెక్సా వాయిస్ సపోర్ట్‌ను మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు యూజర్ ప్రొఫైల్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన టీవీ షోలు, మూవీలను వారు చూడవచ్చు.
 
నూతన ఫైర్ టీవీ స్టిక్‌, ఫైర్ టీవీ స్టిక్ లైట్ డివైస్‌లలో 1.7 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఈ స్టిక్‌లు గతంలో వచ్చిన ఫైర్ టీవీ స్టిక్‌ల కన్నా 50 శాతం ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. వీటిల్లో ఫుల్ హెచ్‌డీకి సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే డ్యుయల్ బ్యాండ్ వైఫై ఫీచర్‌ను ఏర్పాటు చేశారు.
 
ఫైర్ టీవీ స్టిక్‌లో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల స్పీకర్ల నుంచి అత్యంత నాణ్యమైన సౌండ్ వినవచ్చు. ఇక ఫైర్ టీవీ స్టిక్ లైట్‌లో డాల్బీ ఆడియోకు సపోర్ట్‌ను అందిస్తున్నారు.