శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (16:04 IST)

ఎథర్ 450X కలెక్టర్ ఎడిషన్ సీరిస్1ని ఆవిష్కరించిన ఎథర్ ఎనర్జీ

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల్లో ఒకరైన ఎథర్ ఎనర్జీ, సిరీస్ 1గా పిలువబడే ఎథర్ 450X కలెక్టర్ ఎడిషన్‌ని నేడు విడుదల చేసింది. ఈ పరిమిత-ఎడిషన్ స్కూటర్ 2020 జనవరి 28 నాడు ఎథర్ 450X నేషనల్ లాంఛ్‌కు ముందు ఆర్డర్ చేసిన ఎథర్ ఎనర్జీ ఔత్సాహికులకు మాత్రమే లభ్యమవుతుంది.
 
సిరీస్ 1ని ఎథర్ 450X యాంప్లిఫైడ్ పనితీరును అత్యధికంగా ఉపయోగించుకునేందుకు డిజైన్ చేయబడింది. దీని బెస్ట్ ఇన్ క్లాస్ పవర్, టార్క్, యాక్సిలరేషన్ మరియు దాని ప్రీమియం కలర్ మరియు ఫినిష్, లైట్ హైబ్రిడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఛాసిస్‌తోపాటుగా, భారతదేశ రోడ్లపై అపారదర్శక ప్యానెల్స్‌తో  మొట్టమొదటి వాహనం ఇది.
 
ప్రముఖ డిజైన్ తయారీదారుడి వలే, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌లు రూపొందిస్తూ, సీరిస్1 యొక్క నిజమైన స్పెషల్ ఫీచర్ అపారదర్శక ప్యానెల్స్, ఇది స్కూటర్‌కు చురుకైన లుక్‌ని అందిస్తుంది. స్కూటర్ లోపలి భాగాలను చూసేందుకు టింటెడ్ అపారదర్శక ప్యానెల్స్‌ ఆఫర్ చేసే మొట్టమొదటి OEM ఇది. ఎథర్ విలక్షణమైన అల్యూమినియం ఛాసిస్ సీటు కింద కనిపిస్తుంది, ట్రెల్లిస్ ఫ్రేమ్ ఎథర్ స్కూటర్స్‌లో ఒక ప్రత్యేక ఫీచర్. స్కూటర్‌ల సీరిస్ 1 ఎడిషన్ ఇంజినీరింగ్, టెక్ పవర్‌లు, మరియు ఎథర్ 450 ప్రొడక్ట్ లైన్ యొక్క పనితీరు కలగలిసి ఉంది.
 
ఇప్పటికే ఉన్న రంగుల శ్రేణికి (గ్రే, తెలుపు, మింట్ గ్రీన్)కు భిన్నంగా, సిరీస్ 1 రెడ్ యాక్సెంట్‌తో హై గ్లోస్ మెటాలిక్ బ్లాక్ బాడీ కలర్‌తో వస్తుంది. ఈ సిగ్నేచర్ కలర్ సిరీస్ 1 స్కూటర్‌ల్లో స్పెషల్ ఇంట్రో స్క్రీన్‌తో 7 టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్‌లో కూడా కనిపిస్తాయి. స్కూటర్‌ల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన UIలో ఎరుపు రంగు సూక్ష్మ సూచనలు ఉన్నాయి.
 
సీరిస్‌1లో 6 kW PMSM ఎలక్ట్రికల్ మోటార్ ఉంది. ఇది స్టాండర్డ్ ఎథర్ 450X వలే 2.9 kWh లిథియమ్-అయాన్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. దీనిలో కూడా ఎకో, రైడ్, స్పోర్ట్, మరియు అధిక పనితీరు ‘వార్ప్’ మోడ్‌లు కూడా ఉన్నాయి. అంతర్గత పరీక్షల ప్రకారం, 0-40 కిలోమీటర్ల యాక్సిలరేషన్ సమయం కేవలం 3.3 సెకనులు మాత్రమే. భారతదేశంలో 125cc  పనితీరు విభాగాలలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎథర్ 450X ఒకటి.
2020 నవంబర్ నాటికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, కోజికోడ్, ముంబై, ఢిల్లీ ఎన్‌సిఆర్, పూణే, అహ్మదాబాద్, మరియు కోల్‌కతా మొత్తం 11 నగరాల్లో సిరీస్ 1 డెలివరీలు ప్రారంభమవుతాయి. జనవరి 2020కి ముందు ఎథర్ 450Xకు ముందస్తుగా ఆర్డర్ చేసే వినియోగదారులు సీరిస్1 ఎంచుకునేందుకు అర్హులు. సీరిస్1 స్కూటర్‌ల తొలి బ్యాచ్‌లు బ్లాక్ ప్యానెల్స్ విడుదల చేయబడతాయి , మే 2021 నాటికి అపారదర్శకత ప్యానెల్స్‌కు అప్‌గ్రేడ్ చేయబడతాయి.
 
ఎథర్ ఎనర్జీ సిఈవో, మరియు సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఇలా పేర్కొన్నారు. ఆటోమోటివ్ గ్రేడ్ అపారదర్శక ప్యానెల్స్ రూపొందించడం కాస్తంత ట్రిక్కీగా ఉంటుంది మరియు సీరిస్1లో మొట్టమొదటిసారి వాటిని తీసుకొస్తున్నందుకు నాకు ఉత్సాహంగా ఉంది. టీమ్‌లు ఈ డిజైన్ కొరకు అనేక నెలలుగా పనిచేస్తున్నాయి మరియు లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, పూర్తిగా వైవిధ్యభరితమైన దానిని ఉత్పత్తి చేయగలిగాం.