Widgets Magazine

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్, డిజైర్ కార్లను రీకాల్ చేసింది... ఎందుకు?

బుధవారం, 25 జులై 2018 (17:16 IST)

మారుతి సుజుకి సరికొత్త మోడళ్ల కార్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతూ ఆటోమొబైల్ రంగంలో రారాజుగా దూసుకుపోతోంది. మారుతి సుజుకి తీసుకొచ్చిన స్విఫ్ట్, డిజైర్ ఎంతగానో ఆదరణ పొందాయి. తాజాగా ఈ మోడల్‌లో మరికొన్ని మార్పులను చేసి కొత్త జనరేషన్ స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ డిజైర్ కార్లను తీసుకొచ్చారు. ఈ మోడల్ కార్లు లుక్ పరంగా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
Dzire
 
అయితే ఆ సంస్థ తాజాగా భారీ ఎత్తున కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బ్యాగ్స్‌లో లోపాల కారణంగా ఈ కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అందులో మే 7వ తేదీ నుండి జూలై 5వ తేదీ 2018 మధ్య ఉత్పత్తి అయిన కార్లను మాత్రమే పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఈ రీకాల్ జూలై 25వ తేదీ నుండి ప్రారంభం కానుందని ప్రకటించింది.
 
మొత్తం 566 స్విఫ్ట్, 713 డిజైర్ కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి డీలర్లే సంబంధిత వాహన యజమానులను సంప్రదిస్తారని, అలాగే సమస్య తలెత్తిన ఆయా భాగాలను సంస్థ తరపున ఉచితంగా అందిస్తామని, అంతేకాకుండా మరిన్ని వివరాల కోసం మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల్సిందిగా కార్ల యజమానులను కంపెనీ కోరింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

చాలా కాస్ట్లీ గురూ... ఆ కారు ధర అక్షరాలా రూ.121 కోట్లు

మన దేశంలో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లలో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలకు చెందిన కార్లు ...

news

ఇండిగో విమాన చౌక ప్రయాణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

తక్కువ ధ‌ర‌కే విమాన ప్ర‌యాణం, ఉచిత విమ‌నా ప్ర‌యాణం వంటి వార్త‌లు చాలా వ‌స్తుంటాయి. అందులో ...

news

జన్‌ధన్‌ ఖాతాదారులందరికీ శుభవార్త.. ఉచితంగా బీమా!

జన్‌ధన్ ఖాతాదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు శుభవార్త చెప్పనుంది. ప్రతి ...

news

టాయ్‌లెట్ డస్ట్‌బిన్‌లో కేజీల కొద్దీ బంగారం... ఎక్కడ?

బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ డస్ట్‌బిన్‌లో కేజీల కొద్దీ బంగారం ...

Widgets Magazine