చాలా కాస్ట్లీ గురూ... ఆ కారు ధర అక్షరాలా రూ.121 కోట్లు

మన దేశంలో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లలో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. వీటి ధరలు విని వామ్మో అంటూ నోరెళ్లబెడుతాం. కానీ, పగానీ కారు ధర వింటే మాత్రం ఖచ్చితంగా ముక్కున వేలేసుకు

pagani car
pnr| Last Updated: బుధవారం, 25 జులై 2018 (12:11 IST)
మన దేశంలో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లలో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. వీటి ధరలు విని వామ్మో అంటూ నోరెళ్లబెడుతాం. కానీ, పగానీ కారు ధర వింటే మాత్రం ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. ఆ కారు ధర అక్షరాలా రూ.121 కోట్లు. ఆ కారు పేరు పగానీ జోండా హెచ్‌పీ బార్షెట్టా.
 
ఇది.. ముమ్మాటికీ నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాదు కూడా ఇదే. ఇటలీకి చెందిన స్పోర్ట్స్‌ కార్ల ఉత్పత్తుల సంస్థ పగానీ ఆటోమొబైల్స్‌ దీన్ని రూపొందించింది. ఈ కారులో ఏఎంజీవీ12 రకం ఇంజిన్‌‌ను అమర్చారు. ఈ కారు బరువు 1250 కేజీలు. 789 హార్స్‌పవర్‌ సామర్థ్యం కలిగివుంది. 
 
జోండా 760 సిరీస్‌, హుయైరా బీసీ మోడళ్ల హైబ్రిడ్‌ రకమే జోండా హెచ్‌పీ బార్షెట్టా. ఈ సంస్థ ప్రపంచంలోనే ఖరీదైన కార్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే జోండా, హుయైరా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై మరింత చదవండి :