సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (16:09 IST)

అవాంఛిత వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదుకు ఆప్షన్.. తొలి టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్

bsnl
దేశంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్ ఉంది. ఈ కంపెనీ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఇండియాలకు గట్టి పోటీ ఇస్తుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇష్టానుసారంగా టారిఫ్ రేట్లను పెంచేస్తుండటంతో అనేక మంది మొబైల్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా బీఎస్ఎన్ఎల్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నారు. 
 
పాత వినియోగదారులు సైతం నంబర్ పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎలు మారుతున్నారు. అతి త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 5జీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.
 
బీఎస్ఎన్ఎల్ తాజాగా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలు (యూసీసీ)పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఎస్సెమ్మెస్లు, వాయిస్ కాల్స్‌పై బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఇప్పుడు సెల్ఫీ కేర్ యాప్ ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సదుపాయాన్ని దేశంలోని మరే టెలికం సంస్థ అందుబాటులోకి తీసుకురాలేదు.
 
తొలుత బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌‍కేర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. హోంపేజీలో పైన ఎడమవైపు ఉన్న మూడు లైన్లపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రోల్ చేస్తూ కిందికి వస్తే 'కంప్లైంట్ అండ్ ఫ్రిఫరెన్స్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కుడివైపున ఉన్న మూడు గీతలపై క్లిక్ చేస్తే చూజ్ 'కంప్లైంట్స్' అన్న ఆప్షన్ నిపిస్తుంది. అక్కడ ‘న్యూ కంప్లైంట్'పై క్లిక్ చేయాలి. అందులో మనం వాయిస్ ద్వారా కానీ, లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఫిర్యాదు చేసే వెసులుబాటును కల్పించింది.