Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

త్వరలో రూ.100 నాణేల విడుదల... ఎంజీఆర్, సుబ్బులక్ష్మీ బొమ్మలతో?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:57 IST)

Widgets Magazine

నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నడుంబిగించింది. ఇప్పటికే రూ.200 నోట్లను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుతం రూ.100 నోట్లకు బదులుగా నాణేలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలో రూ.100 నాణేల‌ను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. 
 
ఎంజీ రామచంద్రన్‌, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థం వారి శతదినోత్సవ సంద‌ర్భంగా రూ.100, రూ. 5, రూ.10 నాణేల‌ను ముద్రిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని నాణేలను ఎంజీఆర్ బొమ్మ‌తోను, మ‌రికొన్నింటి వెనుక భాగంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి బొమ్మ‌ను ముద్రిస్తామ‌ని తెలిపింది. అలాగే రూ.10 కాయిన్‌పై సుబ్బులక్ష్మి బొమ్మను, రూ.5 కాయిన్‌పై ఎంజీఆర్ బొమ్మను ముద్రిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
 
ఇందులో భాగంగా వందరూపాయల నాణెం44 మి.మీట్లర్లుగా వుంటుందని.. నాలుగు సింహాల అశోనకుని స్థూపం బొమ్మ కూడా ఈ నాణెంపై ముద్రించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వుంటుందని.. వెండి, రాగితో పాటు నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని ఈ నాణెం తయారీకి ఉపయోగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

నోట్ల రద్దుతో నిండా మునిగిన ఆర్బీఐ... నల్లధనానికి వడ్డీ చెల్లిస్తున్న వైనం

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో భారతీయ రిజర్వు బ్యాంకు తీవ్రంగా నష్టపోయింది. ఈ నోట్ల రద్దు ...

news

అమెరికాలో పాకిస్థాన్ బ్యాంక్ మూసివేత

అమెరికాలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ జాతీయ బ్యాంకును మూసివేశారు. ఉగ్రవాదులకు నిధులు ...

news

ఫ్లిప్‌కార్ట్‌లో 90 శాతం డిస్కౌంట్స్‌... ఫెస్టివల్ బిగ్ ఆఫర్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ బిగ్ ఆఫర్ పేరుతో 90 శాతం మేరకు ...

news

ఆన్‌లైన్‌ బదిలీలో నగదు మరో ఖాతాలోకి వెళ్తే ఏం చేయాలి?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ...

Widgets Magazine