ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (17:47 IST)

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధర తగ్గింపు... ఎంత?

LPG Cylinder
దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా తాజా ధరల సవరణ చేపట్టాయి. ఈ క్రమంలో తాజాగా సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.
 
తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కు తగ్గింది. ఇక కోల్‌కతాలో రూ. 1,787, ముంబైలో రూ.1,629, చెన్నైలో రూ. 1,840లకు తగ్గాయి. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు.