Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నోట్ల రద్దును సీక్రెట్‌గా ఉంచడానికి కారణమిదే.... అరుణ్ జైట్లీ

గురువారం, 12 అక్టోబరు 2017 (06:51 IST)

Widgets Magazine

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును అత్యంత రహస్యంగా ఉంచడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగించారు.
 
నోట్లు రద్దుచేస్తామని ముందుగానే ప్రకటిస్తే.. నల్లధనం దాచుకున్న వాళ్లు తమ వద్ద ఉన్న డబ్బును బంగారం, వజ్రాలు, భూముల కొనుగోళ్లు తదితర వాటికి మళ్లించే అవకాశం ఉండేదన్నారు. ఈ విషయంలో పారదర్శకత పాటిస్తే.. భారీ మోసానికి అదో సాధనంగా మారిపోయేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్లరద్దు నిర్ణయం, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. 
 
పారదర్శకత అనేది ఎంతో గొప్ప పదం. కానీ నోట్లరద్దు లాంటి విషయాల్లో దాన్ని పాటిస్తే పెద్ద మోసానికి అవకాశమిచ్చేదిగా ఉండేదని అభిప్రాయపడ్డారు. 'తీసుకున్న నిర్ణయాలపై గోప్యత పాటించడం అవసరం. నోట్లరద్దు నిర్ణయం గొప్ప విజయం సాధించింది. దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన జట్టు, ఆర్‌బీఐ అన్నీ కలిసి పనిచేశాయి. అంతేకాకుండా నిర్ణయం తీసుకొనేటప్పుడే ప్రత్యామ్నాయ నోట్లను ముద్రించాం. ఈ ముద్రణలో వేలాదిమంది భాగస్వాములయ్యారు. కానీ ఎందుకు చేస్తున్నారో మాత్రం వాళ్లకు తెలియలేదు' అని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

గుజరాత్ - మహారాష్ట్రలు తగ్గించాయి.. మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటి?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు తు.చ తప్పకుండా ...

news

54వేల పెట్రోల్ బంకులు మూతపడనున్నాయ్.. 13న దేశ వ్యాప్తంగా బంద్..

దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు మూతపడున్నాయి. డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకూ ...

news

జూలై-సెప్టెంబరులో బెంజ్ కార్ల అమ్మకాలు 41 శాతం పెరుగుదల

మెర్సిడెజ్ బెంజి కార్లు రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకువెళ్తున్నాయి. జనవరి నుంచి ...

news

ఒక్క కలం పోటుతో లక్షల కంపెనీలు రద్దు : ప్రధాని మోడీ

నల్లధనాన్ని అరికట్టేందుకు 2.1 లక్షల నకిలీ కంపెనీలను ఒక్కకలం పోటుతో రద్దు చేశామని ...

Widgets Magazine