శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (10:59 IST)

ఉద్యోగులకు శుభవార్త : నెలవారి కనీస వేతనం పెంపు

దేశంలోని ఉద్యోగులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ నెలవారి కనీస వేతనాన్ని ఖరారు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ.9,880గా కమిటీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఐదు రీజియన్‌లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలు రెండో రీజియన్‌లో ఉన్నాయి. 
 
కనీస వేతనం ఖరారు కోసం జులై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ.4,570గా ఉండగా.. మారిన పరిస్థితుల రిత్యా ఏడేళ్లలో వ్యయంలో భారీ మార్పులు వచ్చినట్లు గుర్తించి, వేతనాన్ని కూడా పెంచింది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర కార్మిక శాఖకు కమిటీ సమర్పించింది.