గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 మార్చి 2022 (22:22 IST)

ఫాంటా యాపిల్ డిలైట్‌ని ఆవిష్కరిస్తోంది; ఫాంటా కొత్త ముఖంగా సమంత పరిచయం

కోకా-కోలా ఇండియా, తదుపరిగా తన బ్రాండ్ యొక్క వర్ణభరిత విభాగాన్ని మధురమైన పళ్ళ రుచి గల వేరియంటుతో విస్తరిస్తూ ఫాంటా యొక్క కొత్త రుచి అయిన యాపిల్ డిలైట్‌ యొక్క ఆవిష్కరణను ప్రకటించింది. ఈ వేసవిలో, ఇండియాలోని వినియోగదారులు తమ మనస్సు, శరీరం స్ఫూర్తిని తాజాగా ఉంచుకోవడానికి నిజమైన యాపిల్ పళ్ళరసముతో మెరిసే పానీయాన్ని ఆస్వాదించగలుగుతారు. ఇండియా యొక్క అభిమాన పళ్ళ రుచిగల బ్రాండు ఫాంటా యొక్క మరొక వినోద దాయిని, ఉత్సాహం మరియు శక్తిని పెంపొందించేలా రూపొందించిన తన కొత్త వర్ణభరిత వాణిజ్య ప్రకటనను కూడా దక్షిణాది చలనచిత్ర సూపర్ స్టార్, బ్రాండ్ యొక్క కొత్త అంబాసిడర్ సమంతా రూత్ ప్రభుతో ఆవిష్కరించింది.

 
సమంతా రూత్ ప్రభు ఫాంటా యాపిల్ డిలైట్ ఆస్వాదిస్తున్నట్లుగా కొత్త వాణిజ్య ప్రకటనలో చూడవచ్చు. అది బ్రాండుతో ఆమె సహవాసము యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. వినియోగదారుల జీవితాలలో ఉల్లాసము, ఉత్సాహాన్ని నింపడానికి ఫాంటా పర్యాయపదంగా ఉంటూ వస్తోంది. మరి యాపిల్ డిలైట్‌తో, వారి ఆధునిక జీవితాలలో అనానుకూలతలు ఉన్నప్పటికీ కూడా వర్ణాభరితంగా నిలవడానికి ఈ కొత్త క్యాంపెయిన్ ఒక సముదాయింపుగా పనిచేస్తుంది.

 
ఇండియా యొక్క తళతళలాడే విభాగములో పళ్ళ రుచి గల పానీయాలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఫాంటా ద్వారా ఈ రుచి యొక్క జోడింపు ఇండియాలోని బ్రాండ్ విభాగాన్ని ఒక రెండు-రుచుల శ్రేణికి పెంపొందిస్తుంది.  ఈ పానీయం దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్యాక్‌లుగా-250మి.లీ, 600 మి.లీ, 750 మి.లీ లలో లభిస్తుంది.

 
ఇండియాలో ఈ ఆవిష్కరణపై వ్యాఖ్యానిస్తూ, కోకా-కోలా ఇండియా- సౌత్ వెస్ట్ ఆసియా స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో గారు ఇలా అన్నారు, “ ‘జీవితానికి పానీయాలు’ అనే మా దార్శనికతకు అనుగుణంగా, నేటి మా వినియోగదారుల ఉద్భవ రుచులు ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తూ, మేము యాపిల్ రుచి విభాగపు శ్రేణి లోనికి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా పైపెచ్చుగా, మా ఆవిష్కరణ ప్రాధాన్యతలు, విస్తృతమైన పరిశోధన, కొత్త ఫాంటా యాపిల్ డిలైట్‌తో మేరిసే యాపిల్ కి తాజాదనపు ఊపును తీసుకురావడానికి మమ్మల్ని ముందుకు నడిపింది” అన్నారు.

 
ఆమె ఇంకా మాట్లాడుతూ, “సమంతా ఆనందదాయకమైన రీతిలో బ్రాండుకు తన స్వంత అభిరుచి శక్తిని తీసుకువస్తుంది. మా ఇటీవలి తాజా వాణిజ్యప్రకటనలో ప్రకాశవంతమైన వేసవి దృశ్యాలు, సవాళ్ళతో కూడిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మా వినియోగదారులు సాధ్యమైనంత ఉల్లాసంగా నిలవాలని గుర్తు చేస్తాయి” అన్నారు.

 
ఫాంటా యొక్క నూతన ముఖతార సమంతా రూత్ ప్రభు, ఇలా అన్నారు, “అనేక దశాబ్దాలుగా ఫాంటా ఉల్లాసానికీ మరియు ఉత్సాహానికీ పర్యాయపదంగా ఉంటూ వస్తోంది.  ఫాంటా యొక్క కొత్త ఆవిష్కరణ, యాపిల్ రుచి యొక్క తాజాదనము ఉన్న ఫాంటా యాపిల్ డిలైట్ ద్వారా బ్రాండుతో సాహచర్యం పొందడం పట్ల నాకు అత్యంత ఆనందంగా ఉంది.  ఈ ఆనందకరమైన క్యాంపెయిన్ ద్వారా, జీవితాన్ని మరీ సీరియస్‌గా తీసుకోవద్దనీ, కుటుంబం మరియు మిత్రులతో ఆనంద క్షణాలు గడపాల్సిందనీ నేను నా ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాను. కేవలం కొత్త ఫాంటా యాపిల్ డిలైట్ చప్పరించండి, ఈ వేసవిలో సంతోషంగా మరియు వర్ణభరితంగా నిలవండి.”