గో ఎయిర్ రిపబ్లిక్ డే ఆఫర్... రూ.726కే ఫ్లైట్ జర్నీ

భారత రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే అనేక కంపెనీలు భారీ తగ్గింపు ధరలతో విమాన ప్రయాణాలను ఆఫర్ చేస్తున్న విషయం తెల్సిందే.

go air flight
pnr| Last Updated: బుధవారం, 24 జనవరి 2018 (12:57 IST)
భారత రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే అనేక కంపెనీలు భారీ తగ్గింపు ధరలతో విమాన ప్రయాణాలను ఆఫర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, గోఎయిర్ విమానయాన సంస్థ కేవలం రూ.726కే విమాన ప్రయాణ టికెట్‌ను రిపబ్లిక్ డే ఆఫర్ కింద అందిస్తున్నట్టు ప్రకటించింది.

బుధవారం నుంచి ఐదు రోజుల వరకు ఆఫర్ పీరియడ్ అమల్లో ఉంటుంది. మార్చి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అన్ని చార్జీలతో కలిపి వివిధ మార్గాల్లో రూ.726 నుంచి రూ.3,926 మధ్య ధరలపై టికెట్లను అందిస్తోంది. గో ఎయిర్ యాప్, గో ఎయిర్ డాట్ ఇన్ ద్వారా బుక్ చేసుకుంటే అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. అన్ని మార్గాల్లో కాకుండా ఎంపిక మార్గాల్లోనే ఉంటాయి. ప్రయాణం రద్దయితే టికెట్లపై రూపాయి కూడా వాపసు రాదు.దీనిపై మరింత చదవండి :