శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (14:17 IST)

మళ్లీ పసిడి జిగేల్‌ : కరోనా కష్టకాలంలో బంగారం ధరలకు రెక్కలు

కరోనా కష్టకాలంలో కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల బాగా తగ్గిన పసిడి ధరలు.. ఇపుడు మళ్లీ పెరిగాయ. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. 
 
హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర రూ.50,000 దాటిపోయింది. రూ.540 లాభంతో  రూ.50,300కు చేరింది. కిలో వెండి ధర కూడా ఒకే రోజు రూ.1,100 పెరిగి రూ.77,300ని తాకింది. 
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలోనూ 10 గ్రాముల మేలిమి బంగారం రూ.527 లాభంతో రూ.48,589కు చేరింది. కిలో వెండి ధర రూ.1,043 లాభంతో రూ.71,775కు చేరువైంది. 
 
ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగింది. జూన్‌లో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం బుధవారం మల్టీ కమొడిటీస్‌ ఎక్స్చేంజ్‌లో రూ.229 లాభంతో రూ.49,096కు చేరింది. 
 
ఇకపోతే, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. న్యూయార్క్‌లో బుధవారం ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,911 డాలర్లకు, వెండి  28.07 డాలర్లకు చేరాయి. 
 
ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మా రకం రేటు బక్కచిక్కడం, అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీరేటు మరింత తగ్గడంతో బంగారం, వెండి ధరలు ర్యాలీ బాట పట్టాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బుధవారం రూ.50 వేలుగా ఉన్న బంగారం ధర గురువారం మాత్రం రూ.49 వేలకు పడిపోయింది.