Widgets Magazine

భారీగా తగ్గిన పసిడి ధర.. బంగారం కొనేయాల్సిందే మరి..

గురువారం, 2 ఆగస్టు 2018 (18:40 IST)

ఆషాఢ మాసం ముగియనున్న నేపథ్యంలో.. శ్రావణ మాసం నుంచి పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఆషాఢ పూర్తయ్యాక పెళ్లి చేసేయాలంటూ.. ముహూర్తం కుదుర్చుకున్న వారికి శుభవార్త. బంగారం ధరలు గురువారం భారీగా తగ్గిపోయాయి. మార్కెట్‌ లో 10 గ్రాముల బంగారం రూ.365 తగ్గి, రూ.30,435 రూపాయలుగా ఉంది. 
 
ఇక కేజీ వెండి ధర రూ.50 తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డ్ అయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.65 శాతం పడిపోయింది. ఔన్స్‌ 1,215.50 డాలర్లుగా నమోదైంది. 
 
బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదైనాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

అద్దె ఇళ్లు.. ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలంటే..? secret pin ద్వారా?

ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక ఆ పని సులభం కానుంది. అద్దె ఇళ్లల్లో ...

news

ఆధార్ నెంబర్ వుంటే హ్యాక్ చేయడం సులభం.. మోదీ మీ నెంబర్ ఇస్తారా?

ఆధార్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు లింక్ చేసేయమని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ...

news

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్, డిజైర్ కార్లను రీకాల్ చేసింది... ఎందుకు?

మారుతి సుజుకి సరికొత్త మోడళ్ల కార్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతూ ఆటోమొబైల్ రంగంలో రారాజుగా ...

news

చాలా కాస్ట్లీ గురూ... ఆ కారు ధర అక్షరాలా రూ.121 కోట్లు

మన దేశంలో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లలో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలకు చెందిన కార్లు ...

Widgets Magazine