గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (15:45 IST)

2019 మార్చి నాటికి ఏటీఎంల మూసివేత

దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడనున్నాయి. ఏటీఎం నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో అన్ని బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఏటీఎంల పరిశ్రమ సమాఖ్య ధృవీకరిస్తోంది కూడా. 
 
ఏటీఎంల నిర్వహణ, నియంత్రణ విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందంటూ ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. 
 
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది. 
 
హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం భారంగా పరిణమించిందని తెలిపింది. ఏటీఎంల నిర్వహణపై 3వేల కోట్ల భారం పడతుందని అంచనా వేసింది.