సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (18:20 IST)

హైదరాబాదులో బిజినెస్ లోన్స్ విపరీతంగా తీసుకుంటున్నారు: హోమ్‌ క్రెడిట్‌ హౌ ఇండియా బారోస్‌ 2021 అధ్యయనం

యూరోప్‌, ఆసియా వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటుగా భారతదేశంలో ఆర్ధిక చేర్పుకు తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ వినియోగదారు ఋణ ప్రదాతకు స్థానిక విభాగం హోమ్‌క్రెడిట్‌ తమ వార్షిక అధ్యయనం ‘హౌ ఇండియా బారోస్‌(హెచ్‌ఐబీ) (ఇండియా ఏవిధంగా ఋణాలను తీసుకుంటుంది)ను నేడు విడుదల చేసింది. ఈ హిబ్‌ అధ్యయనాన్ని కోవిడ్ 19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ అనంతరం చేశారు. సానుకూల వినియోగదారు ఋణ ధోరణి ఇక్కడ కనిపిస్తుంది.

 
ఈ హిబ్‌ స్టడీని భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది నగరాలు-ఢిల్లీ, జైపూర్‌, బెంగళూరు, హైదరాబాద్‌, భోపాల్‌, ముంబై, కోల్‌కతా, పాట్నా, రాంచీలలో నిర్వహించారు. నెలకు 30 వేల రూపాయల లోపు ఆదాయం కలిగిన 21-45 సంవత్సరాల వయసు కలిగిన 1200 మంది స్పందనదారులతో ఈ అధ్యయనం చేసింది.

 
ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం వ్యాపార విస్తరణ (28%), కన్స్యూమర్‌ డ్యూరబల్స్‌ కొనుగోలు (26%), నూతన/పాత ఇళ్లు మరమ్మత్తు (13%), వైద్య అత్యవసరాలు (2%), వాహన ఋణం (9%), వివాహం (3%), విద్యా ఋణాలు (2%) వంటివి ఉంటున్నాయి.

 
హోమ్‌ క్రెడిట్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శ్రీ వివేక్‌ కుమార్‌ సిన్హా మాట్లాడుతూ, ‘‘మా అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం వినియోగదారుల ఋణాల ధోరణి సానుకూలంగా ఉంది. అధికశాతం మంది వినియోగదారులు తమ భావి అవసరాల కోసం ఆన్‌లైన్‌లో ఋణాలను తీసుకోవాలని కోరుకుంటున్నారు’’ అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ ద్వారా ప్రజల జీవితాలలో సానుకూలతను తీసుకురావడాన్ని హోమ్‌ క్రెడిట్‌ విశ్వసిస్తుంది. మారుతున్న ఋణగ్రహీతల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు హెచ్‌ఐబీ అధ్యయనం మాకు తోడ్పడుతుంది. తద్వారా వినియోగదారులకు సరైన రీతిలో మద్దతునందించడమూవీలవుతుంది’’ అని అన్నారు. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, హైదరాబాద్‌, బెంగళూరులు వేగంగా కోలుకున్నాయి. హైదరాబాద్‌లో 41% మంది వ్యాపార పునరుద్ధరణ కోసం ఋణాలు తీసుకున్నారు.