గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (15:45 IST)

బేసిక్ డ్యూటీని తగ్గించిన కేంద్రం : దిగిరానున్న బంగారం ధరలు

gold
దేశంలో బంగారం, పామాయిల్ ధరల తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. దీంతో బేసిక్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఫలితంగా బంగారం, పామాయిల్ వంటి ధరలు కిందకు దిగిరానున్నాయి. ఆర్బీడీ పామోలిన్‌తో పాటు వెండి ధరల్లో కూడా ఈ మార్పు కనిపించనుంది. 
 
ప్రతి 15 రోజులకు ఒకసారి వంట నూనెలు, బంగారం, వెండి దిగుమతులపై బేసిక్ డ్యూటీని కేంద్రం సవరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భారత్ వంట నూనెలు, వెండి విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. బంగారంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 
 
ఈ క్రమంలో అంతర్జాతీయంగా ముడి పామాయిల్‌పై టన్నుకు 996 డాలర్ల నుంచి 937 డాలర్లకు తగ్గింది. శుద్ధిచేసిన పామాయిల్ దిగుమతిపై సుంకం టన్నుకు 1019 డాలర్ల నుంచి 982 డాలర్లకు దిగివచ్చింది. 
 
ముడి సోయా ఆయిల్‌పై 1362 డాలర్ల నుంచి 1257 డాలర్లకు దిగివచ్చింది. బంగారం టన్ను దిగుమతిపై సుంకం 549 డాలర్ల నుంచి 533 డాలర్లకు, వెండిపై 635 నంచి 608 డాలర్లకు దిగివచ్చింది.