Widgets Magazine

రూ.981కే విమాన టికెట్... ఇండిగో డిస్కౌంట్ సేల్ ఆఫర్

మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:30 IST)

దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, కేవలం 981 రూపాయలకే విమాన టికెట్ అందిస్తోంది. జమ్మూ - శ్రీనగర్‌ల మధ్య విమాన టికెట్ ధర రూ.981గా నిర్ణయించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ టికెట్‌ను ఆగస్టు 15వ తేదీలోపు బుక్ చేసుకుని సెప్టెంబర్ 11 నుంచి అక్టోబరు 8వ తేదీ మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. అలాగే మరికొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో కూడా ఈ ఆఫర్లను ప్రకటించింది.
 
ఈ డిస్కౌట్ సేల్ ప్రకారం.. హైదరాబాద్-అహ్మదాబాద్‌ ప్రాంతాల మధ్య టికెట్ ధర రూ.1,992, హైదరాబాద్-లక్నోల మధ్య రూ.2,456, కోల్‌కతా-బెంగళూరుల మధ్య రూ.3,634, కోల్‌కతా-భువనేశ్వర్ ప్రాంతాల మధ్య రూ.1,379, కోల్‌కతా-ఢిల్లీ మధ్య రూ.2,836, కోల్‌కతా-హైదరాబాద్ ప్రాంతాల మధ్య రూ.2,594, ముంబై-బెంగళూరుల మధ్య రూ.1,748, ముంబై-ఢిల్లీ ప్రాంతాల మధ్య రూ.2,255, బెంగళూరు-ఢిల్లీల మధ్య రూ.2,929, అహ్మదాబాద్-బెంగళూరుల మధ్య రూ.2,078, అహ్మదాబాద్-ఢిల్లీల మధ్య రూ.1,415), బెంగళూరు-గోవాల మధ్య రూ.1,782, బెంగళూరు-గోవా ప్రాంతాల మధ్య రూ.1,782, గౌహతి-కోల్‌కతాల మధ్య రూ.1,793 ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రూ.5 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు... ఎలా?

చేతిలో నిలువదనే ఉద్దేశ్యంతో పైసా పైసా కూడబెట్టి కొంత మొత్తంగా తీసుకెళ్లి బ్యాంకు ఖాతాలో ...

news

డిజిటల్ చెల్లింపులపై 20 శాతం క్యాష్ బ్యాక్.... ఆ కార్డుపైనే...

దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, ...

news

మొబైల్ మార్కెట్లో ‘జియో ఫోన్’ జోరు... తెలుగు రాష్ట్రాల్లో హంగామా...

జియో ఫోన్ మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. 2018 సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసికంలో 27% ...

news

సోషల్ మీడియా చీఫ్‌కే ఆ గతి.. పురుగులు, దుర్వాసనతో కూడిన ఆహారం..

రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ...

Widgets Magazine