టెక్నాలజీ గురూ... : చాపలా చుట్టిపెట్టే స్మార్ట్ టీవీలు .. రిమోట్ అక్కర్లేదు...

rollable LG tv
Last Updated: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (09:20 IST)
నానాటికీ టెక్నాలజీ సరికొత్తపుంతలు తొక్కుతోంది. ఫలితంగా డబ్బా టీవీ నుంచి చాపలా చుట్టిపెట్టే స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. నిజానికి ఆ రోజుల్లో ఓ డబ్బా టీవీ కొనుగోలు చేయాలంటే అష్టకష్టాలు పడేవారు. కానీ, ఇపుడు హైఎండ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.

ఇపుడు చాపలా చుట్టిపెట్టే టీవీలు వచ్చేశాయి. వీటిని ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తయారు చేసింది. వీటిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. నిజానికి 2016లోనే ఎల్జీ ఈ తరహా టీవీల గురించి ప్రకటించింది. 18 అంగుళాల టీవీని తీసుకొచ్చింది. ఇప్పుడు చుట్టేసి పెట్టేలా 65 అంగుళాల పెద్ద టీవీని తయారు చేసింది. ప్రపంచంలో చుట్టుచుట్టి పెట్టుకునే మొట్టమొదటి టీవీ ఎల్జీనే కావడం గమనార్హం.

మనకు అవసరం లేనప్పుడు చుట్టుచుట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు. ఎంత చుట్టినా పాడుకాకపోవడం దీని మరో ప్రత్యేకత. రిమోట్‌తో పనిలేకుండా వాయిస్‌ కమాండ్స్‌‌‌‌తోనే దాన్ని ఆపరేట్‌ చేయొచ్చు. అందుకు గూగుల్‌ అసిస్టెంట్‌‌ను ఇందులో పొందుపరిచారు. 55 నుంచి 77 అంగుళాల సైజుల్లో ఐదు మోడళ్లను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ టీవీ ధర, ఇతర ఫీచర్లను త్వరలోనే వెల్లడించనుంది. వచ్చే యేడాది ఈ టీవీలను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకునిరానుంది.దీనిపై మరింత చదవండి :