మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 12 ఆగస్టు 2024 (22:57 IST)

గోపన్‌పల్లి టు తెల్లాపూర్ రోడ్‌లో మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిడా

Buildings
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ మై హోమ్ గ్రూప్, మరో ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్-మై హోమ్ అక్రిడాను ప్రారంభించింది. మై హోమ్ అక్రిడా ఐటి- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న గోపన్‌పల్లి నుండి తెల్లాపూర్ రోడ్ మధ్యలో ఉంది. మై హోమ్ అక్రిడా కింద 3780 ఫ్లాట్‌లను 12 గంభీరమైన టవర్లుతో అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్-1లో భాగంగా 6 టవర్లు బుకింగ్ కోసం తెరవబడ్డాయి.
 
మై హోమ్ అక్రిడా అనేది మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో ఒక భాగం, ఇది మై హోమ్ గ్రూప్, ప్రతిమ గ్రూప్‌ల మధ్య భాగస్వామ్య వెంచర్. దాదాపు 24.99 ఎకరాలలో G+39 అంతస్తులకు విస్తరించి ఈ ప్రాజెక్టు ఉంటుంది. 81% బహిరంగ ప్రదేశాలను అందిస్తోంది. 2BHK, 2.5BHK, 3BHK ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్‌లతో 1399sft నుండి 2347sft వరకు విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లని ఫ్లోర్‌కు 8 ఫ్లాట్‌లతో కూడిన మొత్తం 12 టవర్లుగా నిర్మిస్తుంది. 
 
ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణలుగా 7.5 ఎకరాల సెంట్రల్ ల్యాండ్‌స్కేప్ నిలుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో వుండే ఈ వెంచర్‌లో 2 క్లబ్‌హౌస్‌లు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. 
 
మై హోమ్ అక్రిడా ప్రారంభం  సందర్భంగా మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు మాట్లాడుతూ.. “సౌకర్యం, లొకేషన్ సౌలభ్యం, కమ్యూనిటీలకు దగ్గరగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంలో మై హోమ్ మూడు దశాబ్దాలుగా అగ్రగామిగా ఉంది.  మై హోమ్ అక్రిడా ఆ  నిబద్ధతకు కొనసాగింపు” అని అన్నారు.