రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరక్టర్స్ బోర్డు నుంచి వైదొలగిన నీతా అంబానీ
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. వారి స్థానంలో వారి పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లకు అవకాశం కల్పించారు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
డైరెక్టర్ల బోర్డు వారి నియామకాన్ని సిఫార్సు చేసింది. దాని వాటాదారుల ఆమోదం పెండింగ్‌లో ఉంది. రిటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ, మెటీరియల్స్ వ్యాపారాలతో సహా గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ కీలక వ్యాపారాలలో ముగ్గురు అంబానీ వారసులు పాల్గొంటున్నారు. వారు రిలయన్స్ కీలక అనుబంధ సంస్థల బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు.
ఇకపోతే.. డైరెక్టర్ల బోర్డు కూడా నీతా అంబానీ రాజీనామాను ఆమోదించింది. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారు. తద్వారా కంపెనీ ఆమె సలహా ద్వారా ప్రయోజనం పొందడం కొనసాగిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.