సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (20:33 IST)

హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న ఓలా స్కూటర్లు...

OLa
ప్రముఖ రైడింగ్‌ సంస్థ ఓలా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్‌ స్కూటర్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ 1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయని ఓలా సిఇఒ భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. కంపెనీ ఆన్‌లైన్‌ సేల్స్‌ను సెప్టెంబర్‌ 15న ప్రారంభించిన 24 గంటల్లోనే రూ. 600 కోట్ల విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఎస్‌1, ఎస్‌1 ప్రో వంటి రెండు వేరియంట్ల ను సంస్థ తీసుకువచ్చింది. అయితే భారీ ఆర్డర్ల నేపథ్యంలో గురువారం అర్థరాత్రి నుండి విక్రయాల ప్రక్రియను నిలిపివేశారు.
 
గడిచిన 48 గంటల్లో మొత్తంగా 1,100 కోట్లు విలువ చేసే అమ్మకాలు జరిగాయి. దీపావళి పర్వదినం సందర్భంగా నవంబర్‌ 1న విక్రయాలు పున: ప్రారంభమవుతాయి. బుధవారం స్కూటర్‌ అమ్మకాలను ఓలా యాప్‌ ద్వారా ప్రారంభించగా.. రూ.20 వేలు చెల్లించి, కొనుగోలు చేసుకోవచ్చునని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జులై నుండే రూ. 499తో ముందస్తు బుకింగ్‌ అవకాశం కల్పించిన సమయంలో కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ జరిగిన సంగతి తెలిసిందే.