బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (09:17 IST)

సాగుతున్న పెట్రో బాదుడు... మరోమారు పెంపు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడే సూచనలు కనిపించడం లేదు. గత జనవరి నుంచి ఈ ధరలు పెరుగుతూనే వున్నాయి. ఈ పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. 
 
సోమవారం కూడా పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి. డీజిల్ ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.29 పైస‌లు పెర‌గ‌గా, డీజిల్‌పై రూ.17 పైస‌లు త‌గ్గింది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.15 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.97.79. 
 
ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.101.19, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 89.72, ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.107.20, డీజిల్  రూ.97.29, భోపాల్‌లో పెట్రోల్ ధ‌ర రూ.109.53, డీజిల్ ధ‌ర రూ.98.50, కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.101.35 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.92.81గా ఉన్నాయి.