Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కామ్... రూ.కోట్లు గోల్‌మాల్

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:07 IST)

Widgets Magazine
punjab bank limited

దేశంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)లో ఏకంగా రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. సరైన లెక్కా పత్రాలు లేకుండా బ్యాంకు సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన ప్రముఖ జువెలరీ డిజైనర్‌ నీరవ్‌ మోడీ, అతడి అనుచరులు కొందరు ఈ మొత్తాన్ని కొలగొట్టారు. 
 
విదేశాల్లోని సరఫరాదారులకు చెల్లించేందుకు బ్యాంకుల్లో పైసా కూడా నగదు డిపాజిట్‌ చేయకుండా వీరు అక్రమంగా లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు) పొంది రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్టు పీఎన్‌బి ఆడిటింగ్ విభాగం గుర్తించింది. ఈ వ్యవహారం 2011 నుంచి బ్యాంకు సిబ్బంది సహకారంతో జరుగుతూ వచ్చింది. 
 
ఈ విషయాన్ని సిబిఐకి ఫిర్యాదు చేసినట్టు పిఎన్‌బి స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఈ కుంభకోణానికి బాధ్యులను చేస్తూ బ్యాంక్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌తో సహా 10 మంది ఉద్యోగులపై పిఎన్‌బి వేటు వేసింది. అలాగే, నీరవ్ మోడీ మోసాలపై సిబిఐకి పిఎన్‌బి ఫిర్యాదు చేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం.. సామాన్యుడిపై మరింత భారం?

కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేందుకు సంసిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలను మరింత పెంచే ...

news

3 సెకన్లలో 200 కి.మీ వేగంతో దూసుకెళ్లే బైక్... చూస్తారా(ఫోటోలు)

మూడంటే మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తర్వాత 200 కిలో మీటర్ల వేగంతో ...

news

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేట్లను తగ్గించడంతో పాటు.. ఫెడరల్ ...

news

ముంబై ఎయిర్‌పోర్ట్ కొత్త రికార్డు.. 24 గంటల్లో 980 విమానాలు టేకాఫ్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రికార్డును తనే తిరగరాసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీతో ...

Widgets Magazine