విమాన ప్రయాణికులు అలా చేస్తే రూ.50 లక్షల ఉచిత బీమా

flight
Last Updated: గురువారం, 10 జనవరి 2019 (12:21 IST)
రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకునే వెబ్‌సైట్ ఐ.ఆర్.సి.టి.సి (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). రైలు టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇపుడు, ఈ వెబ్‌సైట్‌లో ఎయిర్ టిక్కెట్స్ కూడా బుక్ చేసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించింది.

ఈ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్నట్టయితే రూ.50 లక్షల విలువ చేసే ఉచిత బీమాను కల్పించనుంది. దీనిపై ఐఆర్‌సీటీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పీ.మల్ మాట్లాడుతూ, అన్ని రకాల విమాన ప్రయాణికులకు ఈ ఉచిత బీమా వర్తించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఐ.ఆర్.సీ.టీ.సీ ద్వారా దాదాపు 6 వేల ఎయిర్ టికెట్స్ బుక్ అవుతున్నాయి. ట్రావెల్స్ పోర్టల్స్ ఒక్కో టికెట్ కు రూ.200 వసూలు చేస్తుండగా ఐ.ఆర్.సీ.టీ.సీ కేవలం రూ.50 మాత్రమే వసూలు చేస్తుంది. టికెట్ల రద్దు విషయంలో కూడా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆయన గుర్తుచేశారు. హోటల్ బుకింగ్స్ కూడా తాము ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.దీనిపై మరింత చదవండి :