బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 29 మార్చి 2023 (23:08 IST)

హైదరాబాద్‌లో సింగిల్‌ డే మెగా డెలివరీ: 200 TVS iQube విద్యుత్‌ స్కూటర్లను డెలివరీ చేసిన టీవీఎస్‌

TVS
ఒకే రోజు చేసిన అతి పెద్ద భారీ డెలివరీ కార్యక్రమంలో,  ప్రపంచంలో సుప్రసిద్ధ ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహనాల తయారీ సంస్ధ టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ, 200 యూనిట్ల TVS iQube  విద్యుత్‌ స్కూటర్లను హైదరాబాద్‌లోని తమ వినియోగదారులకు నేడు అందజేసింది. తెలంగాణాలో ఈ కంపెనీ అపూర్వమైన స్పందనను అందుకుంది.
 
ఈ ఉత్సాహపూరితమైన ఈవీ ప్రయాణంలో, టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ మూడు ముఖ్యమైన మౌలిక సూత్రాలతో స్ఫూర్తి పొందింది. అవి శ్రేణి, కనెక్ట్‌ చేయబడిన సామర్ధ్యాలు, చార్జర్లు మరియు రంగుల కోసం వినియోగదారులకు ఎంపిక శక్తిని అందించడం; తాజా నిబంధనకు కట్టుబడి ఉండటం మరియు డెలివరీ వాగ్ధానానికి దారితీసే కొనుగోలు అనుభవాలపరంగా పూర్తి మనశ్శాంతిని అందించడం మరియు ప్రభావవంతమైనప్పటికీ సౌకర్యవంతంగా ఉండేలా TVS iQube నిర్వహణలోని సరళత. ప్రస్తుతం ఈ స్కూటర్‌ భారతదేశ వ్యాప్తంగా 140 నగరాలలో లభ్యమవుతుంది.
 
గత సంవత్సరం TVS iQube Electric scootersను అత్యున్నత శ్రేణి ఫీచర్లు మరియు మెరుగైన రేంజ్‌తో విడుదల చేశారు. TVS iQube మరియు TVS iQube S  వేరియంట్లు టీవీఎస్‌ మోటర్‌ డిజైన్డ్‌ బ్యాటరీ ప్రమాణాలు అయిన 3.4 కిలోవాట్‌హవర్‌తో వస్తాయి. ఇవి ఒక్కసారి చార్జ్‌ చేస్తే ప్రాక్టికల్‌గా రోడ్డుపై 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. దీనిలో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, హెచ్‌ఎంఐ కంట్రోల్స్‌ మరియు రివర్శ్‌ పార్కింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. TVS iQube మరియు TVS iQube  S వాహనాలు తెలంగాణాలో ఆన్‌ రోడ్‌ ధరలు వరుసగా 1,15,293 రూపాయలు మరియు 1,21,413 రూపాయలలో(ఆన్‌ రోడ్‌, తెలంగాణా, దీనిలో ఫేమ్‌ 2 రాయితీ కూడా కలిపి ఉంటుంది)లభిస్తున్నాయి.