సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (10:08 IST)

స్వల్పంగా పెరిగిన బంగారం.. నిలకడగా వెండి ధరలు

ఆభరణాల నగల ధరల్లో స్వల్ప తేడాలు చోటుచేసుకున్నాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగితే, వెండిధర స్థిరంగా వుంది. నిజానికి వీటి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. కానీ, సోమవారం ఈ పేరుగుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రస్తుతం వీటి ధరలు దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. 
 
హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,431గా ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,448గా ఉంది. 10 గ్రాములు ధర రూ.44,310గా ఉంది. 
 
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,834గా ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.38,672గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 48,340 ఉంది. 
 
హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి. 
 
ఇకపోతే, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.46,310, ఢిల్లీలో రూ.46,460, బెంగళూరులో రూ.44,310, చెన్నైలో రూ.44,860, కోల్‌కత్తాలో రూ.46,900 గా ఉంది.