గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (09:03 IST)

దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. మంగళవారం తగ్గిన పసిడి ధరలు బుధవారం పెరిగాయి. తాజాగా బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపుగా రూ.250 వరకు పెరిగింది. హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.46,150గా ఉంది. 
 
అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,350కి చేరుకుంది. విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.46,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,350గా ఉంది. 
 
దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,670కి ఎగసింది.