శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (10:06 IST)

బంగారం - వెండి ధరల్లో స్వల్ప మార్పులు

gold
దేశంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న వీటి ధరలు బుధవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే గురువారం మాత్రం ఈ ధర్లలో స్వల్పంగా మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం నాటి బులియన్ మార్కెట్‌ ప్రకారం 22 క్యారట్లపై రూ.250, 24క్యారెట్లపై రూ.320 మేర పెరిగాయి. 
 
గురువారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధర రూ.51,550గా వుంది. అలాగే, దేశీయంగా కిలో వెండి ధర రూ.100 మేరకు పెరిగి రూ.55,000లుగా ఉంది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,250గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా వుంది. విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,250గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా వుంది. 
 
చెన్నై నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.48,050గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,420గా వుంది. ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,250గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా వుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,400గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710గా వుంది.