దేశంలో పెరిగిన పసిడి ధరలు - మగువలకు షాక్
దేశంలో పసిడి ధరలు మరోమారు భగ్గుమన్నాయి. శుక్రవారం స్థిరంగా నమోదైన బంగారం ధరలు శనివారం మాత్రం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలను పరిశీలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.44,700 కి చేరింది.
అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగి రూ.48,760 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.900 పెరిగి రూ.68,600 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,760గా ఉంది.
ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ధరలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220గా ఉంది.