గంగోత్రి, ఉత్తరకాశీల్లో రూ.250 పలుకుతున్న టమోటా ధర
టమాటా పండించే ప్రాంతాల్లో ఏర్పడిన వేడిగాలులు, భారీ వర్షాలతో టమోటా సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో డిమాండ్ కూడా పెరిగిపోయింది. తాజాగా గంగోత్రి ధామ్‌లో కిచెన్ టమోటా భారీ ధర పలుకుతోంది. కిలో రూ.250 పలుకుతోంది. అలాగే ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 నుండి రూ.200 వరకు ఉంది.
ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వాటిని కొనేందుకు కూడా ఇష్టపడడం లేదు. గంగోత్రి, యమునోత్రిలో టమాట కిలో రూ. 200 నుంచి రూ.250 పలుకుతోంది. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో టమోటా ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని చెన్నైలోని రేషన్ షాపుల్లో కిలోకు రూ.60 చొప్పున రాయితీ ధరతో టొమాటోలను విక్రయించడం ప్రారంభించింది.