Widgets Magazine

అలా చేస్తేనే పెట్రో ధరలు నేలకు దిగుతాయ్ : ఫడ్నవిస్

గురువారం, 24 మే 2018 (13:50 IST)

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.84గా ఉండగా, చెన్నైలో రూ.80గా ఉంది. అలాగే, వివిధ మెట్రో నగరాల్లో కూడా ఈ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలపై అన్ని విపక్ష పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివారిలో బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. పెట్రోల్ ధరల తగ్గింపునకు ఈయన ఓ చిన్న ఉపాయం చెప్పారు.
petrol price hike
 
అదేంటంటే... పెట్రోల్ ధరలకు కళ్లెం వేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే పరిష్కారమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల తాము వివిధ పన్నులను తగ్గించినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదన్నారు. 'ఇప్పటికే మేము వివిధ పన్నులను చాలావరకు తగ్గించాం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతుండడం వల్ల ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి పెట్రోల్‌ను జీఎస్టీ కిందికి తెచ్చేలా జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అప్పుడే పెట్రోల్ ధరలు దిగివస్తాయి' అని వ్యాఖ్యానించారు. మరి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచిచూడాల్సిందే. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గించొచ్చు.. వెల్లడైన 'చిదంబరం' రహస్యం

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ రహస్యం వెల్లడించారు. ...

news

నాలుగు రోజుల్లో పెరుగుడుకు విరుగుడు : పెట్రో మంటపై అమిత్ షా కామెంట్స్

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి ...

news

కొడైక్కెనాల్‌లో తామర కొడై లగ్జరీ రిసార్ట్స్ ప్రారంభం

ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న కొడైక్కెనాల్‌లో తామర కొడై రిసార్ట్స్ సేవలు అందుబాటులోకి ...

news

పిస్తా హౌస్‌తో జియో భాగస్యామ్యం.. జియో ఫోన్ కొనుగోలుపై హలీం డిస్కౌంట్ కూపన్లు

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన ...

Widgets Magazine