విస్తార్ ఎయిర్‌లైన్స్ ఫెస్టివల్ ఆఫర్ .. రూ.1199కే ఫ్లైట్ టిక్కెట్

vistara
ఠాగూర్| Last Updated: గురువారం, 10 అక్టోబరు 2019 (17:04 IST)
విస్తారా ఎయిర్‌లైన్స్ ఫెస్టివల్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ సర్వీసుల్లో రాగల 48 గంటల్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ అర్థరాత్రి వరకు ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

ఇందులో భాగంగా విమాన టికెట్‌ను రూ.1,199 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. ఆఫర్‌లోభాగంగా టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు అక్టోబరు 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా ఈ ఆఫర్‌ను తీసుకు వచ్చినట్లు విస్తారా యాజమాన్యం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఈ సేల్ కింద కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుందని, గురువారం అక్టోబరు 10, 2019 (గురువారం) నుంచి శుక్రవారం అంటే అక్టోబరు 11 రాత్రి 11.59 నిమిషాల వరకు ఉంటుందని తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ల ద్వారా పండుగ సీజన్‌ను మరింత హ్యాపీగా చేస్తున్నామని, తమ వ్యాపార అభివృద్ధికి మరింతగా తోడ్పడుతుందని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ అభిప్రాయపడ్డారు.

ఈ ఆఫర్ చేస్తున్న ప్రధాన మార్గాల్లో ఢిల్లీ - ముంబై, ముంబై - బెంగళూరు, ముంబై - గోవా, ఢిల్లీ - చెన్నై, ఢిల్లీ - బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తించనుంది.

దీనిపై మరింత చదవండి :