మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (11:17 IST)

మోదీ అంటే నాకెంతో ఇష్టం.. అయినా అగ్రరాజ్యం అసంతృప్తి.. ఎందుకు?

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని చెప్పారు. అయితే, అధ్యక్ష ఎన్నికల లోపు ఒప్పందం కుదురుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఇరు దేశాలకు మరిన్ని లాభాలు చేకూర్చేలా ఒప్పందం ఉండటం కోసం ప్రస్తుతానికి దీన్ని పక్కనబెట్టే అవకాశాలున్నాయని ట్రంప్ తెలిపారు. వాణిజ్య అంశాల్లో భారత్‌ తమతో సరిగ్గా వ్యవహరించట్లేదని చెప్పారు. భారత ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. 
 
ఈ పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి ఒప్పందం కుదరకపోయినా.. పాక్షిక ఒప్పందం వైపు మొగ్గుచూపే అవకాసం వుందని ఆర్థిక పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇరు దేశాలు పెంచిన టారీఫ్‌లే ఒప్పందం ఖరారులో చిక్కుముడి మారినట్లు తెలుస్తోంది. తాజా బడ్జెట్‌లో వైద్య పరికరాల దిగుమతిపై సుంకాన్ని భారత్ మరింత పెంచింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా అసంతృప్తిగా వున్నట్లు సమాచారం.