శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:46 IST)

సచివాలయం ఉద్యోగాలు.. 27న అపాయింట్‌మెంట్ లెటర్స్..

సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 27న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా, సెప్టెంబర్ 27న అర్హత సాధించిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలని భావిస్తోంది.
 
దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హత సాధించిన వారి పూర్తి వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపామని, త్వరలోనే కాల్ లెటర్స్ కూడా పంపుతామన్నారు. మొదట ఓపెన్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తారు.
 
అపాయింట్‌మెంట్ లెటర్స్ రావడానికి ముందు పాసైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ వస్తాయి. ప్రభుత్వం కోరిన సర్టిఫికెట్లను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. ఇందులో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. దీంతోపాటు అభ్యర్థి పొందుపరిచిన ఈమెయిల్‌కు కూడా సమాచారం పంపుతారు.
 
కాగా సెప్టెంబరు 19న గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను జిల్లాలకు పంపించారు. ఆయా జిల్లాల్లోని కమిటీలు ఆయా వివరాలను పరిశీలించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం మెరిట్ జాబితాలను రూపొందించాయి.