సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:12 IST)

విడుదల కానున్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల డేట్ షీట్

సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదలచేయనుంది. పదో తరగతి, 12 వ తరగతికి చెందిన విద్యార్థులకు సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్, కంపాట్మెంట్, ప్రైవేట్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన డేట్ షీట్లను విడుదల చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం cbse.nic.in వెబ్ సైట్లో డేట్ షీట్ అందుబాటులోకి రానుంది.
 
ఇదిలావుంటే, కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ బోర్డు జులై 30న 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఆగస్టు 3న టెన్త్ పరీక్షలను విడుదల చేసింది. బోర్డు విడుదల చేసిన ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చు.
 
ఈ పరీక్షలను ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.