సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (16:14 IST)

సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల వెల్లడి ఎపుడంటే....?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌‍డేట్ వచ్చింది. ఈ ఫలితాలను ఈ నెల 20వ తేదీ తర్వాత వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఈ యేడాది ఫిబ్రవరి - ఏప్రిల్‌ నెలల మధ్యలో ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఆయా స్టేట్ బోర్డు కింద పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు మాత్రం వెల్లడవుతున్నాయి.
 
అలాగే, సీబీఎస్ఈ విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేథ్యంలో సామాజిక మాధ్యమాల్లో రిజల్ట్స్‌కు సంబంధించి ఫేక్‌ సమాచారం చక్కర్లు కొడుతోన్న వేళ బోర్డు స్పందించింది. ఇటీవలే ఆ నకిలీ సమాచారాన్ని ఖండించిన సీబీఎస్‌ఈ అధికారులు.. మే 20 తర్వాతే ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ యేడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వరకు జరగ్గా.. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.